: షాపింగ్ మాల్ లో ఇంటర్ విద్యార్థినిపై అఘాయిత్యం
'షీ టీమ్స్' క్రియాశీలకంగా పనిచేస్తున్నప్పటికీ తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని యాచారం మండల కేంద్రంలోని ఓ షాపింగ్ మాల్ లో ఇంటర్ విద్యార్థినిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో, ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి, నలుగురు కీచకులను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.