: సామినేని ఉదయభాను అరెస్ట్
వైకాపా నేత సామినేని ఉదయభానును పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే, కృష్ణా జిల్లా జగ్గయ్యపేట ఆర్టీసీ డిపో నుంచి ప్రైవేట్ డ్రైవర్లతో బస్సులు నడిపేందుకు ఆర్టీసీ యాజమాన్యం ప్రయత్నించింది. దీన్ని ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా, ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఉదయభాను డిపో వద్దకు చేరుకుని, అక్కడ బైఠాయించారు. దీంతో, ఆర్టీసీ డిపో వద్దకు చేరుకున్న పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి, పీఎస్ కు తరలించారు.