: 100కు ఫోన్ చేస్తే పోలీసు వాహనంలో పరీక్షా కేంద్రానికి తీసుకువెళతాం: ఎంసెట్ విద్యార్థులకు పోలీసుల ఆఫర్


రేపు ఆంధ్రప్రదేశ్ లో ఎంసెట్ రాసే విద్యార్థులకు విజయవాడ పోలీసు కమిషనర్ బంపరాఫర్ ఇచ్చారు. ఎటువంటి రవాణా సౌకర్యం లేని విద్యార్థులు 100 నెంబరుకు ఫోన్ చేసి చిరునామా చెబితే వారి వద్దకు వచ్చి పోలీసు వాహనంలో పరీక్షా కేంద్రానికి తీసుకువెళ్తామని తెలిపారు. విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులూ పడకూడదన్నదే తమ అభిమతమని తెలిపారు. ఎంసెట్ కేంద్రాలకు విద్యార్థులను తీసుకువెళ్లేందుకు ప్రజలందరూ సాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇతర ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు సైతం ముందుకు రావాలని కోరారు. తమతమ వాహనాలలో వారి ప్రాంతాల నుంచి పరీక్షా కేంద్రాలకు విద్యార్థులను చేరవేయాలని సూచించారు.

  • Loading...

More Telugu News