: రాజస్థాన్ ఫీల్డింగ్...హైదరాబాద్ బ్యాటింగ్
ఐపీఎల్ సీజన్-8లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ జట్టుతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడుతోంది. టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవడంతో, హైదరాబాదు జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. ఈ మ్యాచ్ లో గెలిచి ప్లేఆఫ్ లో అడుగు పెట్టాలని రాయల్స్ భావిస్తుండగా, రాజస్థాన్ ను ఓడించి ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలని హైదరాబాదు జట్టు ఆశిస్తోంది. రాజస్థాన్ 14 పాయింట్లతో ప్లేఆఫ్ కు అడుగు దూరంలో నిలవగా, హైదరాబాదు జట్టు 8 పాయింట్లతో కింది నుంచి రెండో స్థానంలో ఉంది.