: రేవంత్ రెడ్డి ఆస్తుల వివరాలు సేకరించండి... హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల తహశీల్దార్లకు మౌఖిక ఆదేశాలు


టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆస్తుల వివరాలపై ఆరా తీసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు రేవంత్ ఆస్తుల సమాచారం సేకరించాలని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల తహశీల్దార్లకు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. అంతకుముందు కేసీఆర్ పై రేవంత్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఓ న్యాయవాది పరువునష్టం దావా వేశారు. దాంతో ఆయన హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవడంతో ఈ కేసులో విచారణ ప్రక్రియ నిలిచిపోయింది. అంతేగాక కేసీఆర్ కుమార్తె, ఎంపీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అసెంబ్లీ సమావేశాల్లో రేవంత్ ను మాట్లాడనివ్వని సంగతి విదితమే.

  • Loading...

More Telugu News