: లక్షల మంది రాసే ఎంసెట్, డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయలేం: మంత్రి గంటా


ఈ నెల 8, 9 తేదీల్లో జరగనున్న ఎంసెట్, డీఎస్సీ పరీక్షలకు మొత్తం 7 లక్షల మంది విద్యార్థులు హాజరవుతారని ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. అన్ని లక్షల మంది రాస్తున్న ఆ పరీక్షలను వాయిదా వేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సమ్మెపై ఆర్టీసీ కార్మికులు పునరాలోచించుకోవాలని గంటా కోరారు. ఎంసెట్ పరీక్ష రాస్తున్న వాళ్లలో ఆర్టీసీ కార్మికుల పిల్లలు కూడా ఉన్నారని చెప్పారు. ఏదేమైనా విద్యార్థులు ఇబ్బందిపడకుండా ప్రభుత్వపరంగా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్నామన్నారు. సాధ్యమైనన్ని బస్సులు నడుపుతామని గంటా పేర్కొన్నారు. కాబట్టి విద్యార్థులు రాత్రిలోగా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని గంటా సూచించారు.

  • Loading...

More Telugu News