: సల్మాన్ ను పరామర్శించిన అమీర్ ఖాన్


బాంబే హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో స్వల్ప ఊరట లభించిన నటుడు సల్మాన్ ఖాన్ ను ఈరోజు మరో నటుడు అమీర్ ఖాన్ కలిశాడు. ముంబయి బాంద్రాలోని సల్మాన్ నివాసం గెలాక్సీ అపార్ట్ మెంట్ కు వెళ్లి పరామర్శించాడు. తిరిగి వెళ్లే సమయంలో ఇంటి నుంచి బయటికి వచ్చిన సల్మాన్ ను అమీర్ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నాడు. ఈ సమయంలో మీడియా క్లిక్కుమనిపించిన ఫోటో అంతర్జాలంలో హల్ చల్ చేస్తోంది. నిన్న(బుధవారం) రాత్రి బెయిల్ పై ఇంటికి వచ్చిన సల్మాన్ ను చూసేందుకు బాలీవుడ్ సెలబ్రిటీలు క్యూ కట్టారు. కుటుంబసభ్యులు, కథానాయికలు ప్రీతీజింటా, సోనాక్షి సిన్హా, రాణిముఖర్జీ, బిపాసాబసు, సంగీతా బిజలానీ... హీరో సునీల్ శెట్టి, నటుడు సోనూ సూద్, యువహీరో పుల్ కిత్ సమ్రాట్, దర్శకులు సల్మాన్ ను పరామర్శించారు.

  • Loading...

More Telugu News