: మరింత తగ్గిన బంగారం ధర
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు మరింతగా తగ్గాయి. ఈ మధ్యాహ్నం 2 గంటల సమయంలో సింగపూర్ సెషన్లో ఔన్సు (సుమారు 28.34 గ్రాములు) బంగారం ధర క్రితం ముగింపుతో పోలిస్తే 0.7 శాతం తగ్గి 1,183.60 డాలర్ల వద్ద (సుమారు రూ. 75,750) కొనసాగింది. అంటే ఇండియాలో 10 గ్రామల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 26720 వద్ద ఉండాలి. నిన్నటి ధర రూ. 27,350 (హైదరాబాద్)తో పోలిస్తే రూ. 630 తగ్గాల్సిన 10 గ్రాముల ధర స్థానిక కారణాలు, రూపాయి మారకపు విలువలో మార్పుల కారణంగా, ముంబై మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో రూ. 26,959 వద్ద ట్రేడవుతోంది. తదుపరి సెషన్లలో బంగారం ధర మరింతగా తగ్గవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా, ఇంటర్నేషనల్ మార్కెట్లో వెండి ధర ఔన్సుకు 1 శాతం తగ్గగా, భారత మార్కెట్లో కిలో వెండి ధర రూ. 140 తగ్గి, రూ. 37,850 వద్ద కొనసాగుతోంది.