: బీహార్ ఎన్నికల కోసమే ఏపీకి బీజేపీ అన్యాయం చేస్తోంది: జేడీ శీలం
ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్, బీజేపీలు పరస్పరం దూషించుకుంటున్నాయి. బీహార్ ఎన్నికల కోసమే ఏపీకి బీజేపీ అన్యాయం చేస్తోందని కాంగ్రెస్ ఎంపీ జేడీ శీలం ఆరోపించారు. ఈ అంశంపై బీజేపీ తుచ్ఛ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. బీజేపీ, టీడీపీని తరిమికొట్టే రోజు దగ్గర్లోనే ఉందని ధ్వజమెత్తారు. బీజేపీ మాట నిలబెట్టుకోకుండా ఏపీకి వెన్నుపోటు పొడించిందని జేడీ మండిపడ్డారు. కొంతకాలం నుంచి బీహార్ కూడా ప్రత్యేక హోదా అడుగుతోంది. వచ్చే ఏడాది ఈ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ అధికారంలోకి రావాలని భావిస్తున్న బీజేపీ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే బీహార్ కూడా అడుగుతుందన్న ఆలోచనలోనే ఇలా చేస్తోందని జేడీ శీలం అభిప్రాయం.