: బైక్ ను ఢీకొన్న ఆర్టీసీ అద్దె బస్సు... ఇద్దరు దుర్మరణం
ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె ప్రజల పాలిట శాపంలా పరిణమించింది. ఉద్యోగులు సమ్మెకు దిగడంతో, ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుని... కొన్ని బస్సులను నడుపుతోంది. ఈ క్రమంలో, కరీంనగర్ జిల్లా సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తాలో ఆర్టీసీ అద్దె బస్సు ఈ రోజు ఓ బైక్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో, ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఈ నేపథ్యంలో, స్థానికులు, ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. సరైన శిక్షణ లేని డ్రైవర్లతో బస్సులు నడిపితే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయని... ఆర్టీసీ ఉద్యోగులు ఆరోపించారు. సమ్మె నేపథ్యంలో, డ్రైవర్లు, కండక్టర్లుగా తాత్కాలిక ఉద్యోగులను ఆర్టీసీ నియమించిన సంగతి తెలిసిందే.