: ఎంసెట్ అభ్యర్థులతో విశాఖ వెళ్తున్న కేశినేని బస్సుకు యాక్సిడెంట్
రేపు జరగనున్న ఎంసెట్ పరీక్ష రాసేందుకు 40 మంది విద్యార్థులతో విశాఖపట్నం వెళ్తున్న కేశినేని ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. తాడేపల్లిగూడెం సమీపంలో ఈ బస్సును భారీ లారీ ఒకటి ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. కాగా, ఎంసెట్ విద్యార్థులకు తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ కార్మికుల సమ్మె శాపంగా మారింది. ప్రధాన పరీక్షా కేంద్రాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖ, తిరుపతి, కడప, గుంటూరు వంటి పట్టణాలకు చేరుకునే మార్గంలేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.