: ముంబై అమ్మాయితో ములుగు అబ్బాయిని కలిపిన ఫేస్ బుక్
అతను వరంగల్ జిల్లా ములుగు పట్టణానికి చెందిన కిరణ్. ఆమె ముంబైలో ఉండే సరస్వతి. వీరిద్దరికీ సామాజిక మాధ్యమం ఫేస్ బుక్ లో రెండేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. అది తొలుత స్నేహమై, ఆపై ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. తల్లిదండ్రులను సంప్రదించి వారిని ఒప్పించారు. ఇరువురి పెద్దల అంగీకారంతో వారి ప్రేమ పెళ్లి పీటలెక్కింది. నిన్న ములుగులోని చర్చిలో ఒకటయ్యారు. ఈ వేడుకకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ వచ్చి వధూవరులను ఆశీర్వదించారు.