: తల్లిని హింసిస్తే గుప్త నిధులు... గుడ్డిగా నమ్మిన కుమార్తె, భర్త
కన్న తల్లిని హింసిస్తే గుప్త నిధులు దొరుకుతాయని ఒక జ్యోతిష్యుడు చెప్పిన మాటలను గుడ్డిగా నమ్మారు. కన్న బిడ్డలే ఆ తల్లిని పెట్టకూడని చిత్రహింసలు పెట్టారు. తీవ్రగాయాలపాలు చేశారు. సభ్య సమాజం తలదించుకునేలా ఉన్న ఈ ఘటన అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం చెర్లోపల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రామాంజనమ్మ, చెండ్రారాయుడు భార్యాభర్తలు. వీరికి శాంతి అనే కూతురు ఉంది. కొద్ది కాలం క్రితం వారు ఓ జ్యోతిష్యుడ్ని సంప్రదించగా, రామాంజనమ్మను హింసిస్తే మీకు గుప్త నిధులు దొరుకుతాయని చెప్పాడు. దీంతో కట్టుకున్న భార్య అని కూడా చూడకుండా భర్త, కన్న తల్లి అని కూడా చూడకుండా కుమార్తె, రామాంజనమ్మను చిత్ర హింసలకు గురిచేశారు. దీన్ని గమనించిన స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అరెస్ట్ చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.