: మీరాడుకున్న ఆ 'పాము' తిరిగొస్తోంది!


ఆ పాము మీకు గుర్తుందా? సెల్ ఫోన్లు మార్కెట్లోకి వచ్చిన కొత్తల్లో ప్రీలోడెడ్ గా వచ్చిన 'స్నేక్' గేమ్. గంటల కొద్దీ టైమ్ తినేసే ఈ గేమును ఒక్కసారన్నా ఆడనివాళ్లు ఉండనే ఉండరంటే అతిశయోక్తి కాదు. 1997లో నోకియా 6110 ఫోన్లో తొలిసారిగా లోడ్ అయిన ఈ 'స్నేక్' గేమ్ కొన్ని వందల రకాల ఫోన్లలో చేరి కోట్లాది మందిని అలరించింది. మోనోక్రోమ్ సెల్ ఫోన్లలో నల్ల గడులను (స్నేక్) నాలుగు వైపులా కదుపుతూ దాని పొడవును పెంచుతూ వెళ్లడమే ఈ గేమ్ అన్న సంగతి తెలిసిందే. దీన్ని డిజైన్ ఇంజనీర్ తానెల్లీ ఆర్మాంటో తయారు చేశారు. ఒక్క నోకియా కంపెనీలోనే 40 కోట్ల ఫోన్లలో ఈ గేమ్ ను ప్రీలోడ్ చేశారంటే, దీనికి వచ్చిన ఆదరణను ఊహించొచ్చు. అయితే, ఆ తరువాత ఆండ్రాయిడ్, విండోస్ ఆధారిత స్మార్ట్ ఫోన్లు రావడంతో ఈ గేమ్ ప్రాచుర్యాన్ని కోల్పోయింది. ఇప్పుడు అదే గేమ్ ను మరింత ఆకర్షణీయంగా, మంచి గ్రాఫిక్స్ తో తయారుచేసిన ఆర్మాంటో స్మార్ట్ ఫోన్లకు అందుబాటులోకి తెచ్చారు. టచ్ మాధ్యమంలో మరిన్ని స్టేజ్ లతో, ఉత్కంఠపెడుతూ సాగే గేమ్ కు 'స్నేక్ రివైండ్' పేరు పెట్టి విడుదల చేయనున్నారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ప్రపంచంలో తొలిసారిగా ఆండ్రాయిడ్, విండోస్, ఐఓఎస్ ఆపరేటింగ్ వ్యవస్థల్లో పనిచేసేలా ఒకేసారి విడుదలవుతున్న గేమ్ ఇదే.

  • Loading...

More Telugu News