: సల్మాన్ నివాసానికి పోటెత్తిన అభిమానులు...ఉద్రిక్తత


బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నివాసానికి అభిమానగణం పోటెత్తింది. హిట్ అండ్ రన్ కేసులో ఐదేళ్లు జైలు శిక్ష విధించడం సల్లూభాయ్ అభిమానులను బాధించింది. బెయిల్ పై విడుదలైన సల్మాన్ రాత్రి 8 గంటలకు బాంద్రాలోని తన నివాసం గెలాక్సీ అపార్ట్ మెంట్ వద్దకు చేరుకున్నారు. సల్లూభాయ్ కంటే ముందే ఆయన నివాసానికి చేరుకున్న అభిమానులు, 'వుయ్ సపోర్ట్ సల్మాన్ భాయ్' అంటూ నినాదాలు చేశారు. అభిమానులకు అభివాదం చేస్తూ, సల్మాన్ తన నివాసానికి వెళ్లిపోయారు. సల్మాన్ చేరుకునే సరికి ఆయన నివాసం వద్ద వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. దీంతో, కొంత ఉద్రిక్తత చోటుచేసుకుంది.

  • Loading...

More Telugu News