: మరుపూరు వద్ద రాడార్ సిగ్నల్స్ బాగా అందుతున్నాయి


నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని మరుపూరు వద్ద రాడార్ సిగ్నల్స్ బాగా అందుతున్నాయని చెన్నై వైమానిక స్థావర వింగ్ కమాండర్ మణి చెప్పారు. మరుపూరు వద్ద భారత వైమానిక దళానికి 63.3 ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శత్రుదేశాల ముప్పు పసిగట్టేందుకు మరుపూరు వద్ద నిఘా కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఇక్కడ రాడార్ సిగ్నల్స్ బాగా అందుతున్నాయని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News