: అద్దంపై రాసి ఆత్మహత్య చేసుకుంది!
జంటనగరాల్లో ఆత్మహత్యలు ఎక్కువవుతున్నాయి. ప్రేమలో వైఫల్యం, నమ్మినవాళ్ల మోసాలు, వైవాహిక జీవితంలో కలతలు వ్యక్తులను బలవన్మరణానికి పురికొల్పుతున్నాయి. తాజాగా, ఆల్వాల్ పంచశీల కాలనీలో లీలప్రియ అనే అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడింది. నిజామాబాద్ కు చెందిన లీలప్రియ 40 రోజుల క్రితం అభిషేక్ అనే యువకుడిని ప్రేమ వివాహం చేసుకుంది. అయితే, అత్తింటి వేధింపులు ఆమెను మనస్తాపానికి గురిచేశాయి. దీంతో, ఇంట్లో ఉన్న పెద్ద అద్దంపై "నా చావుకు ఎవరూ కారణం కాదు" అని రాసి ప్రాణాలు తీసుకుంది. అయితే, ఆమె తల్లిదండ్రులు మాత్రం అత్తింటి వారు తమ బిడ్డను వేధించారని, భరించలేకే ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తున్నారు.