: గిటార్ పట్టిన నేపాల్ పశుపతినాథ్ ఆలయ పూజారి
నేపాల్ లో భూకంపం వేలాది జీవితాల్లో చీకట్లను మిగిల్చింది. కట్టుకున్నవాళ్లను, కన్నబిడ్డలను, తల్లిదండ్రులను కోల్పోయిన వాళ్ల రోదనలతో నేపాల్ మరుభూమిని తలపిస్తోంది. తన దేశ వాసుల కష్టాలను చూసి చలించిపోయాడు సుయోల్ రాజభద్రి. సుయోల్ ప్రఖ్యాత పశుపతినాథ్ ఆలయంలో పూజారి. 13 భాషల్లో ప్రావీణ్యం ఉంది. భూకంప బాధితుల వెతలు చూసి, వారికి సాయపడాలని నిర్ణయించుకున్నాడు. గిటార్ అందుకుని, దేశ వ్యాప్తంగా తిరుగుతూ పాటలు పాడుతూ సాయం అర్థిస్తున్నాడు. పగలంతా పాటలు పాడుతూ తన దేశ వాసులకు సాయం చేయాలని కోరుతున్నాడు.