: కిటికీలోంచి దూరి బాబా రాందేవ్ ఆలయంలో భారీ చోరీ
రాజస్థాన్ లోని జైసల్మేర్ జిల్లాలో బాబా రాందేవ్ ఆలయంలో భారీ చోరీ జరిగింది. బలమైన నిఘా ఉన్న ఆలయంలోని కిటికీలోంచి లోపలికి ప్రవేశించిన దొంగలు, వంద కేజీలకుపైగా ఉన్న వెండి ఆభరణాలను, 4,35 లక్షల రూపాయల నగదును దొంగిలించినట్టు ఆలయ అధికారులు గుర్తించారు. దీంతో వారు జైసల్మేర్ పోలీసులను ఆశ్రయించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. ఈ దొంగతనంలో ఆరు నుంచి ఏడుగురు వ్యక్తుల ముఠా పాల్గొని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం సీసీటీవీ పుటేజీ పరిశీలిస్తున్నామని, తొందర్లోనే ఈ కేసు ఓ కొలిక్కి వస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.