: ఇకనైనా సమ్మె విరమించండి... ఆర్టీసీ కార్మికులకు ఎండీ విజ్ఞప్తి


ఆర్టీసీ కార్మికులు ఇకనైనా సమ్మె విరమించాలని ఎండీ సాంబశివరావు విజ్ఞప్తి చేశారు. సమ్మె వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. హైదరాబాద్ లోని బస్ భవన్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ అని, అలాగే విద్యార్థులకు వివిధ పరీక్షలు జరుగుతాయని ఎండీ చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రజలు, విద్యార్థులు ఇక్కట్లు పడుతున్నారని వివరించారు. కాగా భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమల, తిరుపతికి బస్సులు నడిపేందుకు కార్మిక సోదరులు మినహాయింపు ఇచ్చారన్నారు. ఏపీలో 12వేల బస్సులుంటే వాటిలో 2వేల అద్దె బస్సులు ఉన్నాయని సాంబశివరావు గుర్తు చేశారు. ఆర్టీసీ చరిత్రలో ఇంతవరకు 27 శాతం ఫిట్ మెంటే ఇస్తూ వస్తున్నామని, 49 శాతం ఇవ్వడం సాధ్యం కాదని అన్నారు.

  • Loading...

More Telugu News