: విద్యార్ధుల కోసం ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించాలి: మంత్రి గంటా


ఏపీలో ఈ నెల 8న ఎంసెట్, 9న డీఎస్సీ పరీక్షలు యథాతథంగా జరగనున్నాయని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఈ పరీక్షలకు 7.5 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని విశాఖలో చెప్పారు. వారి భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని సమ్మె విరమించాలని ఆర్టీసీ కార్మిక సంఘాలకు మంత్రి విజ్ఞప్తి చేశారు. 49 శాతం ఫిట్ మెంట్ కోసం కార్మిక సంఘాలు నిన్నటి (మంగళవారం) నుంచి సమ్మె చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో ఎంసెట్, డీఎస్సీ ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. రవాణా సౌకర్యం సరిగా ఉండని నేపథ్యంలో విద్యార్థులు ఏ పరిస్థితుల్లో వచ్చినా అరగంట సమయం అదనంగా ఇస్తామని ప్రభుత్వం తెలిపింది.

  • Loading...

More Telugu News