: ప్రధానమంత్రి సహాయనిధికి కపిల్ రూ.51 లక్షల విరాళం
భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ప్రధానమంత్రి జాతీయ విపత్తు సహాయనిధికి రూ.51 లక్షల విరాళాన్ని అందించారు. తన సంస్థ 'ఖుషీ' (కిన్ షిప్ ఫర్ హ్యూమానిటేరియన్ సోషల్ అండ్ హోలిస్టిక్ ఇంటర్వెన్షన్ ఇన్ ఇండియా) తరపున ఆ చెక్ ను కపిల్ దేవ్ ప్రధానికి అందజేశారు. ఆపన్నుల కోసం తన విరాళాన్ని ఉపయోగించాలని ఆయన ప్రధానిని కోరారు.