: సల్మాన్ కు శిక్షపై బాలీవుడ్ ప్రముఖుల స్పందన


హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ ఖాన్ కు శిక్ష పడడంపై బాలీవుడ్ దిగ్భ్రాంతి చెందింది. మంచి మనసున్న వ్యక్తిగా పేరున్న సల్మాన్ ఖాన్ కు ఐదేళ్ల జైలు శిక్ష పడడంపై సర్వత్ర ఆందోళన వ్యక్తమవుతోంది. కోర్టు తీర్పుపై వ్యాఖ్యానించనని చెప్పిన రితేష్ దేశ్ ముఖ్, మనసంతా సల్మాన్ ఖాన్ తోనే ఉందని ట్వీట్ చేశారు. బాలీవుడ్ దయార్ధ్ర హృదయుల్లో సల్మాన్ ఒకరని ఆయన పేర్కొన్నాడు. తన తల్లిని కాపాడిన మంచి మనిషి సల్మాన్ అని, సల్మాన్ చేసిన సాయాన్ని తానెన్నడూ మర్చిపోనని నటి దియామీర్జా ట్విట్టర్లో పేర్కొంది. సల్మాన్ మంచి మనిషి అని, దాని గురించి ఎవరూ మాట్లాడడం లేదని, ఆయనకు శిక్షపై ఏం మాట్లాడాలో తెలియడం లేదని సోనాక్షి సిన్హా ఆవేదన వ్యక్తం చేసింది. సల్మాన్ కు శిక్ష విధించారన్న వార్తతో తన గుండె ఆగినంతపనైందని కునాల్ కోహ్లీ పేర్కొన్నాడు. సల్మాన్ దోషి అని చెప్పినా అతనిని తాను సపోర్ట్ చేస్తానని అర్జున్ కపూర్ ట్వీట్ చేశాడు. మన వాళ్లు ఎవరైనా తప్పు చేసి శిక్షించబడితే బాధపడతాం, అలాగే సల్మాన్ కు శిక్షపై కూడా బాధపడుతున్నామని, ఆయనంటే తమకు చాలా ఇష్టమని, ఆయన వెంటే ఉంటామని అలియా భట్ పేర్కొంది.

  • Loading...

More Telugu News