: బెదిరింపులకు లొంగలేదని ఆన్ లైన్ లో వీడియో పెట్టిన నయవంచకుడు


ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నానని, తాను తప్ప మిగిలిన ప్రపంచమంతా మోసంతో కూడుకున్నదని చెప్పి నయవంచనకు పాల్పడ్డాడో కామాంధుడు. పంజాబ్ లో నవదీప్ కుమార్ అలియాస్ లక్కీ అనే యువకుడు స్థానిక యువతితో 2005లో కొంతకాలం సన్నిహితంగా మెలిగాడు. ఆమెకు 2011లో వేరే వ్యక్తితో వివాహమైంది. అయినప్పటికీ తనతో సంబంధం కొనసాగించాలని, లేని పక్షంలో తనతో సన్నిహితంగా ఉన్నప్పుడు వీడియోలు తీశానని, అవి ఇంటర్నెట్ లో పెడతానని బ్లాక్ మెయిలింగ్ కు దిగాడు. దీనికి ఆమె అంగీకరించకపోవడంతో వీడియోను అప్ లోడ్ చేశాడు. దీనిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, నవదీప్ సింగ్ ను అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News