: టీడీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలని ఆదేశించిన కోర్టు


మాజీ మంత్రి, టీడీపీ తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ పై కేసు నమోదు చేయాలని హైదరాబాదులోని మేడ్చల్ కోర్టు ఆదేశించింది. ఎన్ఆర్ఐ కాలేజీకి సంబంధించిన అనుమతులలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. రాజేంద్రతో పాటు మరో నలుగురిపై కూడా కేసు నమోదు కానుంది. వీరిపై 420, 458, 471, 120 (బి) సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని పోలీసులకు సూచించింది. కుత్బుల్లాపూర్ మాజీ కార్పొరేటర్, మున్సిపల్ మాజీ కమిషనర్ లపై కూడా కేసు నమోదుకానుంది.

  • Loading...

More Telugu News