: భూముల రిజిస్ట్రేషన్ కు పాన్ కార్డు తప్పనిసరి: డిప్యూటీ సీఎం కేఈ
ఏపీలో లక్ష రూపాయలకు పైగా విలువ ఉండే భూముల రిజిస్ట్రేషన్ కు పాన్ కార్డు తప్పకుండా ఉండాలని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి చెప్పారు. రెవెన్యూ శాఖలో సంస్కరణలను వేగవంతం చేస్తామని, ఈ-పాస్ బుక్ ల జారీలో ఆలస్యం జరుగుతోందని అన్నారు. సర్వేయర్లు లేకపోవడంవలననే ఇలా జరుగుతుందన్న కేఈ, త్వరలోనే ఈటీఎస్ మిషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. తహశీల్దార్లకు కొత్త వాహనాలు సమకూరుస్తామని, కార్యాలయ భవనాలు దెబ్బతిన్న ప్రాంతాల్లో కొత్త భవనాల నిర్మాణం చేపడతామని పేర్కొన్నారు. నేపాల్ లో దెబ్బతిన్న పశుపతినాథ్ ఆలయం పునరుద్ధరణకు రూ.2 లక్షల విరాళం ఇస్తున్నట్టు వెల్లడించారు.