: ఐఎస్ఐఎస్ లో చేరేందుకు బయలుదేరి, హైదరాబాద్ ఎయిర్ పోర్టులో దొరికిపోయిన యువకులు


సిరియాకు వెళ్లి ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ లో చేరాలన్న ఉద్దేశంతో బయలుదేరిన 14 మంది యువకులను హైదరాబాద్ ఎయిర్ పోర్టు అధికారులు పట్టుకున్నారు. 'ఆపరేషన్ చక్రవ్యూహ' పేరిట పోలీసులు, విమానాశ్రయ అధికారులు గత కొంతకాలంగా లండన్, టర్కీ తదితర ప్రాంతాలకు వెళుతున్న వారిపై గట్టి నిఘా పెట్టారు. ఇందులో భాగంగా, ఏమాత్రం అనుమానం వచ్చినా వారిని మరింతగా విచారిస్తున్నారు. 14 మంది ఐఎస్ఐఎస్ లో చేరేందుకే బయలుదేరారని గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ విషయాన్ని సీనియర్ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. వారిని నిశితంగా గమనిస్తున్నామని చెప్పిన ఆయన, వివరాలు తెలిపేందుకు మాత్రం నిరాకరించారు. కాగా, ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలకు చెందిన మహమ్మద్ ఆతిఫ్ వసీమ్ లండన్ లో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్న సమయంలో ఐఎస్ఐఎస్ కు ఆకర్షితుడై అక్కడి నుంచి సిరియాకు వెళ్లి సైన్యం దాడిలో మరణించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత హైదరాబాద్ విమానాశ్రయం నుంచి వెళ్లే యువతపై మరింతగా దృష్టిని సారించినట్టు సమాచారం. వసీమ్ తో పాటు సిరియాలో ఉన్నాడని భావిస్తున్న కరీంనగర్ యువకుడి గురించిన వివరాలను సేకరించే పనిలో పోలీసులు ఉన్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News