: సల్మాన్ కు ఐదేళ్ల జైలు శిక్ష


హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ ఖాన్ కు ఐదేళ్ల జైలు శిక్ష ఖరారయింది. ఈ మేరకు తుది తీర్పును ముంబై సెషన్స్ కోర్టు జడ్జి వెలువరించారు. కొద్ది సేపటి క్రితమే సల్మాన్ ఖాన్ ను కోర్టు దోషిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అనంతరం శిక్షకు సంబంధించి, కోర్టులో వాదనలు జరిగాయి. సల్మాన్ చేసిన సామాజిక సేవా కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని రెండేళ్లకు మించి శిక్ష విధించరాదంటూ... కోర్టును సల్మాన్ తరపు న్యాయవాది కోరారు. అయినప్పటికీ, ఐదేళ్ల జైలు శిక్షను విధిస్తూ జడ్జి తుది తీర్పును వెలువరించారు. దీంతో సల్మాన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాసేపట్లో ఆయనను ఆర్థర్ రోడ్డు జైలుకు తరలించనున్నారు. 2002లో ఇదే కేసులో సల్మాన్ 18 రోజులు జైల్లో గడిపారు.

  • Loading...

More Telugu News