: ఫ్లూయిడ్స్ తీసుకునేందుకు శివాజీ నిరాకరణ... ఆసుపత్రిలోనే దీక్ష కొనసాగిస్తానని ప్రకటన
ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చే వరకు ఆసుపత్రిలోనే దీక్ష కొనసాగిస్తానని సినీ నటుడు శివాజీ స్పష్టం చేశారు. అయితే ఆయనకు ఫ్లూయిడ్స్ ఎక్కించేందుకు వైద్యులు ప్రయత్నించగా శివాజీ నిరాకరించారు. నాలుగు రోజుల నుంచి మంచినీళ్లు కూడా తీసుకోకుండా దీక్ష చేస్తుండటంతో బలవంతంగా శివాజీని గుంటూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శివాజీ దీక్ష భగ్నంతో ఉద్యమం ఆగదని, ప్రజలు ఆయన పక్షాన ఉన్నారని మాలమహానాడు నేత కారెం శివాజీ అన్నారు.