: పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసిన బీజేపీ


పార్టీ ఎంపీలకు భారతీయ జనతా పార్టీ విప్ జారీ చేసింది. కీలక బిల్లుల ఓటింగ్ సమయంలో పార్లమెంటుకు తప్పకుండా హాజరుకావాలని ఆదేశింది. ఇప్పటికే పార్లమెంటులో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (జీఎస్ టీ) బిల్లుపై చర్చ జరిగింది. దానికి సంబంధించి లోక్ సభలో రాజ్యాంగ సవరణ జరిగే సమయంలో అందరూ సభలోనే ఉండాలని ఆదేశించింది. ఇదిలా ఉంటే స్థిరాస్తి నియంత్రణ బిల్లు తీర్మానాన్ని నేడు రాజ్యసభలో వెంకయ్యనాయుడు ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలోనే పార్టీ ఎంపీలందరూ అందుబాటులో ఉండాలని బీజేపీ విప్ జారీ చేసింది.

  • Loading...

More Telugu News