: ఈసారి సోనియా వంతు... సర్కారుపై అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్న కాంగ్రెస్ అధినేత్రి
సరిగ్గా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయనగా, రెండు వారాల సెలవు తీసుకుని రెండు నెలల తర్వాత లోక్ సభలో ఎంట్రీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలో పోరాట యోధుడిని చూస్తున్నాం. సరికొత్త రీతిలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ అధికార పక్షాన్ని ఇరుకున పెట్టిన రాహుల్ గాంధీ అందరినీ ముక్కున వేలేసుకునేలా చేశారు. తాజాగా ఆయన తల్లి, పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అధికార పక్షంపై విరుచుకుపడేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. కీలక శాఖల పనితీరు, ఆయా శాఖల్లో పేరుకుపోయిన ఖాళీలు తదితరాలపై ఆమె పూర్తి స్థాయిలో అధ్యయనం చేశారట. అంటే, బీజేపీ సర్కారుపై అటు రాహుల్ తో పాటు, ఇటు సోనియాగాంధీ కూడా వరుస దాడులు చేస్తారన్నమాట.