: నవ్యాంధ్ర కాదు... నేరాంధ్రగా మారుస్తున్నారు: బాబుపై రఘువీరా ధ్వజం
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుపై ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మండిపడ్డారు. అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన వైకాపా నేత హత్యను చూస్తుంటే... ప్రభుత్వమే దగ్గరుండి ఈ హత్యలకు పాల్పడుతోందని అనిపిస్తోందని ఆరోపించారు. హత్య జరిగిన కార్యాలయంలో రికార్డులను తగులబెట్టడం వెనుక పెద్ద కుట్ర దాగుందని అన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ చేస్తానంటూ ప్రగల్భాలు పలికిన చంద్రబాబు... రాష్ట్రాన్ని నేరాంధ్రప్రదేశ్ గా మార్చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేతలకు గన్ మెన్లను తొలగిస్తున్న ప్రభుత్వం... రాజకీయ హత్యలకు లైసెన్సులు ఇస్తోందని మండిపడ్డారు. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 43 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.