: శిద్ధా... పరిస్థితి ఎలా ఉంది?: ఏపీ రవాణా మంత్రికి చంద్రబాబు ఫోన్


ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రజా రవాణా పూర్తిగా స్తంభించింది. ప్రయాణం మధ్యలో ఉన్న జనం ఎక్కడికక్కడే చిక్కుకుపోయారు. ఎలాగోలా గమ్యస్థానం చేరేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఇదే అదనుగా ప్రైవేట్ ట్రావెల్స్ ఆపరేటర్లు ఇష్టారీతిన జనాన్ని దోచుకుంటున్నారు. ఏపీలో పరిస్థితిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆరా తీశారు. రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావుకు చంద్రబాబు ఫోన్ చేశారు. సమ్మె నేపథ్యంలో పరిస్థితి ఎలా ఉందని అడిగిన ఆయన, ప్రజలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు తదితరాలపై ఆరా తీశారు. ప్రైవేట్ ట్రావెల్స్ ఆపరేటర్లు సేవలందిస్తున్నారని, కొంతమందిని తాత్కాలిక ప్రాతిపదికన నియమించుకుని ఆర్టీసీ బస్సులను కూడా తిప్పేందుకు యత్నిస్తున్నామని శిద్ధా, సీఎంకు తెలిపారు. అయితే రైల్వే లైన్ అందుబాటులో ఉన్న రూట్లలో అదనపు రైళ్ల ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టాలని చంద్రబాబు సూచించారు.

  • Loading...

More Telugu News