: పట్టపగలు బీచ్ లో రాసలీలలు... పదిహేనేళ్ల జైలు శిక్షకు అవకాశం
అతడు 40 ఏళ్ల జోస్ కాబలెర్రో. ఆమె 20 ఏళ్ల ఎలీసా అల్వారెజ్. పావుగంట పాటు క్షణికావేశంలో చుట్టూ నలుగురూ ఉన్నారన్న ఇంగితజ్ఞానం కూడా లేకుండా ఫ్లోరిడా బీచ్ లో పట్టపగలు శృంగారానికి దిగారు. పక్కన చిన్న పిల్లాడు ఉన్నాడని కూడా మరిచిపోయారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాయి. స్పందించిన పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేసి కేసు పెట్టగా, కోర్టు విచారణకు స్వీకరించింది. ఒకటిన్నర రోజుల పాటు కేసును విచారించి వీరిద్దరూ నేరానికి పాల్పడ్డారని తేల్చింది. తీర్పు తేదీని వెలువరించనప్పటికీ, కనీసం చెరో పదిహేనేళ్ల వరకూ జైలు శిక్ష విధించవచ్చని అసిస్టెంట్ స్టేట్ అటార్నీ ఆంటోనీ డొఫాంసెకా వివరించారు. గతంలో అల్వారెజ్ కు నేర చరిత్ర లేదని, అయితే, కాబలెర్రో డ్రగ్స్ సరఫరా కేసులో 8 ఏళ్ల శిక్ష అనుభవించాడని చెప్పిన ఆయన, కాబలెర్రోకు మరింత భారీ శిక్ష పడవచ్చని కూడా అంచనా వేశారు.