: ‘ప్రాజెక్టుల వద్దే పడక’కు చంద్రబాబు శ్రీకారం... నేడు తోటపల్లి రిజర్వాయర్ వద్ద రాత్రి బస
సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో వేగాన్ని పెంచి త్వరితగతిన వాటిని పూర్తి చేయించేందుకు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నేడు కార్యరంగంలోకి దూకుతున్నారు. ‘ప్రాజెక్టుల వద్దే పడక’ పేరిట నేడు మొదలుకానున్న ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా నేటి నుంచి మూడు రోజుల పాటు ఆయన సాగునీటి ప్రాజెక్టుల వద్దే రాత్రి బస చేయనున్నారు. ఈ క్రమంలో నేడు విజయనగరం జిల్లాకు వెళ్లనున్న చంద్రబాబు, నేటి రాత్రి తోటపల్లి రిజర్వాయర్ పరిసరాల్లో బస్సులోనే నిద్రిస్తారు. అనంతరం ఆయన రేపు చిత్తూరు, ఆ మరునాడు కడప జిల్లాల్లోనూ పర్యటిస్తారు.