: సినీ దర్శకుడు మణిరత్నంకు అస్వస్థత, ఆసుపత్రికి తరలింపు


ప్రస్తుతం ఢిల్లీలో వున్న ప్రముఖ సినీ దర్శకుడు మణిరత్నంకు గత రాత్రి స్వల్ప గుండెపోటు వచ్చింది. తన ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పడంతో, బంధువులు వెంటనే ఆయన్ని అక్కడి అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మణిరత్నం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు వివరించారు. మరిన్ని వివరాలు చెప్పేందుకు వారు నిరాకరించారు. ఆయనకు ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో చికిత్స అందిస్తున్నట్టు వివరించారు. కాగా, గతంలో కూడా మణిరత్నంకు ఓ సారి ఛాతినొప్పి రావడంతో చికిత్స పొందారు. మణిరత్నం పలు సూపర్ హిట్ చిత్రాలు తీసి నేటి తరం దర్శకులకు ఆదర్శంగా నిలిచారు. 1995లో ఆయనకు పద్మశ్రీ అవార్డునిచ్చి కేంద్ర ప్రభుత్వం సత్కరించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News