: నా కండలకు అంతా ఫిదా అయిపోతారనుకుంటే...రాక్షసుడు అంటున్నారు: రొమారియో డాస్


సాధారణంగా మంచి వయసులో ఉండగా కండలు సంపాదించాలనే కోరిక అందరికీ ఉంటుంది. అలాంటి కోరికే రొమారియో డాస్ కు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. దీంతో కండలు ఎందుకు సంపాదించుకున్నానురా బాబూ? అంటూ నిట్టూరుస్తున్నాడు. బ్రెజిల్ లోని కాల్దాస్ నోవాస్ కు చెందిన రొమారియో డాస్ (25) బాడీ బిల్డింగ్ చేసి కండలు పెంచి ఆందర్లోకీ ఆకర్షణీయంగా తయారుకావాలని భావించాడు. దీంతో, బైసెప్స్ బాగా పెంచాలని నిర్ణయించుకుని, తన భార్య ఆరు నెలల గర్భంతో ఉండగా, బాడీ బిల్డింగ్ ప్రారంభించాడు. ఈ క్రమంలో స్నేహితుల సలహాతో తొందరగా కండలు పెంచడానికి, 'సింతటిక్ ఫిల్లర్ సింతాల్' ను శరీరంలోకి ఇంజెక్ట్ చేసుకోవడం ప్రారంభించాడు. అది వ్యసనంగా మారడంతో, కొన్నాళ్లకు ఇంజక్షన్స్ కూడా చేతుల్లోకి దూరడం మానేశాయి. దీంతో, వైద్యులను సంప్రదించగా, ఇకపై ఇంజెక్షన్లు తీసుకోవడం ఆపేయాలని సూచించారు. లేనిచో ప్రాణానికే ప్రమాదమని హెచ్చరించారట. పెంచిన కండలను చూసి అంతా హీరోలా ఉన్నావంటారని భావిస్తే, మృగం, రాక్షసుడు అంటున్నారని రొమారియో వాపోయాడు.

  • Loading...

More Telugu News