: హెచ్ఐవీ రక్తంతో పత్రిక ముద్రణ


వియన్నాకు చెందిన 'ద వాన్ గార్డిస్ట్' పత్రిక ఎయిడ్స్ పై అపోహలను పారదోలేందుకు సాహసం చేసింది. తన మే నెల సంచికను హెచ్ఐవీ పాజిటివ్ రక్తం కలిపిన ఇంకుతో ముద్రించింది. ఇన్ఫెక్షన్ సోకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని, నిర్దేశిత మార్గదర్శకాలను పాటించామని ప్రచురణకర్తలు తెలిపారు. 30 ఏళ్లుగా ఈ ప్రాణాంతక వైరస్ పై ప్రచారం చేస్తున్నా, ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమవుతున్న అంశాల జాబితాలో 6వ స్థానంలో ఉందని వివరించారు. తమ లైఫ్ స్టైల్ మ్యాగజైన్ సమాజంపై ప్రభావం చూపే అంశాలను ఎత్తిచూపే బాధ్యతను కలిగి ఉందని 'వాన్ గార్డిస్ట్' పత్రిక సీఈవో జూలియన్ వీల్ తెలిపారు

  • Loading...

More Telugu News