: కేంద్ర మంత్రులు, ఎంపీలను నిలదీయండి: శివాజీ
కేంద్ర మంత్రులు, ఎంపీలను ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిలదీస్తే కానీ ప్రత్యేకహోదా సాధ్యం కాదని సినీ నటుడు శివాజీ తెలిపాడు. గుంటూరులో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా కోసం ఆయన చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష మూడోరోజుకు చేరుకున్న సందర్భంగా శివాజీ మాట్లాడుతూ, ప్రజలకు వాస్తవాలు నెమ్మదిగా అర్థమవుతున్నాయని అన్నాడు. రాష్ట్ర విభజనను కాంగ్రెస్ మాత్రమే చేసిందని ప్రజలు భావించారని, కాదు, దేశంలోని పార్టీలన్నీ కలిపి ఏపీపై కక్షగట్టాయన్న విషయం నెమ్మదిగా తెలుస్తోందని అన్నారు. రాజకీయ నాయకులను నమ్మవద్దని ఆయన సూచించారు. ప్రజల్లో చైతన్యం వస్తే కానీ నేతల్లో మార్పు రాదని శివాజీ తెలిపాడు. ప్రజలు తిరగబడాలని శివాజీ సూచించాడు.