: తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన వివరాలు
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల పాటు ఈ పర్యటన ఉంటుంది. ముందుగా రాహుల్ ఈ నెల 10న ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ చేరుకుంటారు. ఆ రోజు అక్కడే గిరిజన తండాలో బస చేస్తారు. 11వ తేదీన ఆత్మ గౌరవ యాత్రలో పాల్గొని, అక్కడి నుంచి వడ్యాల్, రాచాపూర్, పొత్తుపల్లి, లక్ష్మణచాంద, కొరటికల్ లలోని రైతు కుటుంబాలను పరామర్శిస్తారు. మొత్తం 15 కిలో మీటర్ల పాదయాత్రలో ఐదు రైతు కుటుంబాలను రాహుల్ పరామర్శించనున్నారు.