: సినీ నటి నీతూ అగర్వాల్ కు షరతులతో కూడిన బెయిల్
ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో సినీ నటి నీతూ అగర్వాల్ కు బెయిల్ లభించింది. ఈ మేరకు కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. ఎర్రచందనం అక్రమరవాణాలో గత నెలలో వైఎస్సార్సీపీ నేత, స్మగ్లర్ మస్తాన్ వలీని పోలీసులు అరెస్టు చేశారు. నీతూ బ్యాంకు ఖాతాల ద్వారా నగదు కార్యకలాపాలు జరిపినట్టు మస్తాన్ ద్వారా తెలిపింది. దాంతో ఈ వ్యవహారంలో ఆమెకు కూడా సంబంధాలున్నాయని భావించిన పోలీసులు బెంగళూరు వైపు పారిపోతున్న ఆమెను ఇటీవలే అదుపులోకి తీసుకున్నారు. తరువాత కోర్టు ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించింది.