: కేజ్రీ ఇంటిముందు బీజేపీ కార్యకర్తల ఆందోళన... విశ్వాస్ పై చర్య తీసుకోవాలని డిమాండ్
పార్టీ నేతలపై వస్తున్న ఆరోపణలు, విమర్శలతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇబ్బందుల్లో పడ్డారు. ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ నేత కుమార్ విశ్వాస్ పై పార్టీకి చెందిన ఓ మహిళా కార్యకర్త తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ విషయంపై పార్టీ అధినేతగా, సీఎం హోదాలో కేజ్రీ ఇంతవరకు స్పందించలేదు. దాంతో ఢిల్లీలో ఆయన నివాసం ముందు బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. విశ్వాస్ ను కాపాడేందుకు కేజ్రీ ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. తక్షణమే ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో కేజ్రీవాల్ ఇంటి ముందున్న బారికేడ్లను పక్కకునెట్టి లోపలికి వచ్చేందుకు బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించారు. ఈలోగా అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. అయితే కుమార్ పై వచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆయనపై, అతని భార్యపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్టు ఢిల్లీ పోలీసులు చెప్పారు.