: మహిళలను మోసం చేస్తే మట్టికొట్టుకు పోతారు: చంద్రబాబుపై వాసిరెడ్డి పద్మ ఫైర్


ఏపీలో డ్వాక్రా గ్రూపులన్నీ మూలనపడే పరిస్థితి నెలకొందని వైకాపా నేత వాసిరెడ్డి పద్మ విమర్శించారు. అధికారంలోకి వచ్చి ఏడాదైనా... డ్వాక్రా మహిళల రుణాలను చంద్రబాబు మాఫీ చేయలేదని అన్నారు. హామీలు నెరవేర్చనప్పుడు, వాటిని ఎన్నికల మేనిఫెస్టోలో ఎందుకు చేర్చారని నిలదీశారు. మహిళలను మోసం చేస్తే మట్టికొట్టుకు పోతారని చెప్పారు. మహిళల ఉసురు తగలకమానదని అన్నారు. రైతు రుణమాఫీ విషయంలో కూడా ఇదే జరిగిందని... రుణమాఫీ పూర్తిగా జరిగిందని ఒక్క రైతుతోనైనా చెప్పించగలరా? అని ఆమె ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News