: భారత్ అమ్ములపొదిలో 'ఆకాశ్'
ఆధునికీకరించిన ఆకాశ్ క్షిపణిని భారత సైన్యంలో ప్రవేశపెట్టారు. దీంతో, భారత అమ్ములపొదిలో మరో ప్రధాన అస్త్రం చేరినట్టయింది. ఈ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ చేరికతో యుద్ధరంగంలో భారత్ సామర్థ్యం ఇనుమడిస్తుందని రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు. ఆకాశ్ సాయంతో గగనతల ముప్పును సమర్థంగా ఎదుర్కొనేందుకు వీలవుతుంది. ఫైటర్ విమానాలు, హెలికాప్టర్లను కూల్చివేసే సామర్థ్యం ఆకాశ్ సొంతం. దీని రేంజ్ 25 కిలోమీటర్లు కాగా, 20 కిలోమీటర్ల ఆల్టిట్యూడ్ లో ప్రయాణిస్తుంది. డీఆర్డీవో ఈ మిస్సైల్ ను అభివృద్ధి చేసింది. భూమికి 30 మీటర్ల ఎత్తులోనూ ప్రయాణించడం ద్వారా శత్రు దేశాల రాడార్లను ఏమార్చడం దీని ప్రత్యేకత.