: రాహుల్ గాంధీకి వరుసబెట్టి ప్రశ్నలు గుప్పించిన శివసేన
రైతుల కోసం పాదయాత్ర చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై శివసేన వరుసబెట్టి ప్రశ్నాస్త్రాలు సంధించింది. ఇప్పుడు రైతుల కన్నీళ్లు తుడిచేందుకు వచ్చిన రాహుల్, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని నిలదీసింది. "అధికారంలో ఉన్నప్పుడు వాళ్ల కన్నీళ్లెందుకు తుడవలేదు? మీ సర్కారు రైతులకిచ్చిన వాగ్దానాలు ఏమయ్యాయి? రైతులను రుణ విముక్తులను చేస్తామని అప్పుడు మీరెందుకు భరోసా ఇవ్వలేదు?" అంటూ శివసేన తన సామ్నా పత్రిక సంపాదకీయంలో ఏకిపారేసింది. ఇప్పుడొచ్చి రైతుల పక్కన కూర్చుని టీ, బిస్కెట్లు తినడం మరింత సిగ్గుచేటని విమర్శించింది.