: కడప నగరపాలక సంస్థ బిల్ కలెక్టర్ కుమారుడు కిడ్నాప్
కడప నగరపాలక సంస్థలో బిల్ కలెక్టర్ గా పనిచేస్తున్న మల్లికార్జున కుమారుడు యశ్వంత్ ను కొంతమంది దుండగులు అపహరించారు. అతని వయసు కేవలం ఆరు సంవత్సరాలే. తమకు డబ్బులు ఇవ్వాలంటూ బాలుడిని కిడ్నాప్ చేసిన వ్యక్తులు అతని తండ్రికి ఫోన్ చేసి డిమాండ్ చేశారు. వెంటనే ఈ విషయాన్ని మల్లికార్జున్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం వారు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. మిగిలిన వివరాలు వెల్లడికావల్సి ఉంది.