: నిబంధనల్లోని లొసుగులతో ఏఐ విమానాలను ఆలస్యం చేస్తున్న ఉద్యోగి!
అంతర్జాతీయ రూట్లలో ఒక విమాన ప్రయాణానికి, మరో ప్రయాణానికీ మధ్య పైలెట్లు, సిబ్బంది తీసుకోవాల్సిన విశ్రాంతి నిబంధనలను అలుసుగా తీసుకుని పదేపదే విమానాల ఆలస్యానికి కారణమవుతున్న ఒక ఉద్యోగిని ఎయిర్ ఇండియా తొలగించింది. డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) నిబంధనల పేరు చెప్పి గడచిన మూడు నెలల వ్యవధిలో 10 విమానాలు బయలుదేరే సమయాన్ని ఆలస్యం చేసిన ఉద్యోగిని నిబంధనల మేరకు ఒక నెల వేతనం ఇచ్చి తొలగించినట్టు ఎయిర్ ఇండియా జనరల్ మేనేజర్ వివరించారు. ఆలస్యంగా రావడం ఆ ఉద్యోగి అలవాటని, దీనివల్ల వందలాది మంది ప్రయాణికులు సమయానికి గమ్యస్థానాలకు చేరలేక పోయారని తెలిపారు. ఇతని నిర్వాకంతో జెడ్డా నుంచి బయలుదేరాల్సిన ఎన్నో విమానాలు ఆలస్యంగా నడిచాయని వివరించారు.