: ఓటేసి గెలిపించాలని భారతీయుల కాళ్ల చుట్టూ తిరుగుతున్న బ్రిటన్ నేతలు


బ్రిటన్ నేతలంతా ఇప్పుడు భారతీయుల చుట్టూ తిరుగుతున్నారు. ఓట్లేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. ఎల్లుండి బ్రిటన్ లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. బ్రిటన్ లో సుమారు 6.20 లక్షల మందికి పైగా ప్రవాస భారతీయులకు ఓటు హక్కు ఉంది. అభ్యర్థుల గెలుపు ఓటముల్లో వీరి పాత్ర కీలకం కావడంతో, బ్రిటన్ రాజకీయ పార్టీలు ప్రవాస భారతీయుల ఓట్లపై దృష్టి పెట్టాయి. ఇప్పటికే, బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ భారతీయులు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో పర్యటించి తమకు ఓటు వేయాలని కోరారు. తమ తమ మ్యానిఫెస్టోల్లో సైతం ప్రవాస భారతీయులపై హామీల వర్షం కురిపించారు. గత ఎన్నికల్లో ఎన్నారైలలో అత్యధికులు లేబర్ పార్టీకి మద్దతు పలకగా, ఈ దఫా వారిపై ఆదరణ తగ్గిందని ముందస్తు సర్వేలు వెల్లడించాయి. మొత్తం 45 స్థానాల్లో గెలుపోటములను శాసించే స్థాయిలో ఇండియన్స్ ఉన్నారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News