: అతని నిజాయతీకి ఘనమైన కానుక


ఒక ఈ-కామర్స్ సంస్థలో జరిగిన తప్పు ఆ యువకుడికి ల్యాప్ టాప్ ను బహుమతిగా అందించింది. వివరాల్లోకి వెళితే, మొబైల్ కామర్స్ వెబ్ సైట్ పేటీఎం మాధ్యమంగా అనుజ్ చౌహాన్ ఏప్రిల్ 10న ఒక రూ. 1,145 విలువైన వైఫై రూటర్ ను ఆర్డరిచ్చాడు. ఏప్రిల్ 16న ఇంటికి డెలివరీ వచ్చింది. సాధారణ రూటర్ బాక్స్ తో పోలిస్తే డెలివరీ బాయ్ తెచ్చిన బాక్స్ సైజ్ చాలా పెద్దదిగా ఉంది. ఆ ఆర్డర్ తనది కాదని అనుజ్ చెప్పగా, మరోసారి సరిచూసుకోవాలని ఆ బాయ్ చెప్పాడు. బాక్స్ పై అడ్రస్, ఇ-మెయిల్, మొబైల్ నెంబర్ వివరాలన్నీ అనుజ్ వే ఉన్నాయి. దీంతో పెద్ద బాక్స్ లో ప్యాక్ చేసి వుంటారులే అనుకొని డెలివరీ తీసుకున్నాడు. ఇంట్లోకి వెళ్లి చూస్తే, రూ. 30 వేల విలువైన డెల్ ల్యాప్ టాప్ ఉంది. దీంతో ఆశ్చర్యానికి లోనైన అనుజ్, దాన్ని తిరిగి ఇచ్చేయాలని భావించి, పేటీఎం ఫేస్ బుక్ పేజీలో వివరాలు పోస్ట్ చేశాడు. అతని నిజాయతీకి మెచ్చి ఆ ల్యాప్ టాప్ ను అతనికి బహుమతిగా ఇస్తున్నట్టు సంస్థ ప్రకటించింది.

  • Loading...

More Telugu News