: అమెరికా బయలుదేరిన కేటీఆర్... రెండు వారాల పాటు అక్కడే మకాం!


తెలంగాణ సీఎం కేసీఆర్ కుమారుడు, ఆ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు(కేటీఆర్) కొద్దిసేపటి క్రితం అమెరికా బయలుదేరారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా ఆయన చేస్తున్న ఈ పర్యటన రెండు వారాల పాటు కొనసాగనుంది. రేపు అమెరికాలో కాలుమోపనున్న కేటీఆర్ ఈ నెల 6న వాషింగ్టన్ లోని భారత రాయబారితో భేటీ అవుతారు. ఆ తర్వాత అమెరికాలోని పలు రాష్ట్రాల్లో పర్యటించనున్న ఆయన అక్కడి కార్పొరేట్ సంస్థలకు చెందిన ప్రతినిధులు, యాజమాన్యాలతో వరుస భేటీలు నిర్వహిస్తారు. ఈ నెల 18న మైక్రోసాఫ్ట్ సీఈఓ, తెలుగు తేజం సత్య నాదెళ్లతోనూ ప్రత్యేకంగా సమావేశమవుతారు.

  • Loading...

More Telugu News